MNCL: జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసే విషయంలో మండల ప్రజలకు నిరాశ ఎదురవుతుంది. జన్నారం పరిసర మండలాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడకలకు పెంచుతామని 2019లో నాటి పాలకులు హామీ ఇచ్చారు. ఏడు సంవత్సరాలు కావస్తున్నా ఆసుపత్రి స్థాయిని పెంచే చర్యలు కనిపించడం లేదు. మంచిర్యాలలో వైద్య శాఖ మంత్రి హామీ నెరవేరలేదు.