WG: పెనుమంట్ర మండలం మార్టేరు ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ సోలార్ రూఫటాప్ కనెక్షన్ల ప్రారంభోత్సవానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోలార్ కనెక్షన్లపై అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆగ్రహించిన మంత్రి.. నరసాపురం డీఈ, ఆచంట ఏడీలకు మెమోలు జారీ చేయాలని ఎస్ఈని ఆదేశించారు.