»Ap Cid Searches In Former Minister Narayanas Daughters House
AP CID searches: మాజీ మంత్రి నారాయణ కూతురు ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) కుమార్తె శర్వాణి నివాసంలో ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ (Andhra Pradesh CID) శుక్రవారం సోదాలు నిర్వహించింది. కూకట్ పల్లి, కొండాపూర్, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని (Andhra Pradesh capital) అమరావతి (Amaravati) భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అధికారులు సోదాలు జరిపినట్లుగా సమాచారం.
మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) కుమార్తె శర్వాణి నివాసంలో ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ (Andhra Pradesh CID) శుక్రవారం సోదాలు నిర్వహించింది. కూకట్ పల్లి, కొండాపూర్, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని (Andhra Pradesh capital) అమరావతి (Amaravati) భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అధికారులు సోదాలు జరిపినట్లుగా సమాచారం. మనీ రూటింగ్ కు పాల్పడి అమరావతిలో భూములను కొనుగోలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. దాదాపు 146 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, ఇందుకు సంబంధించి ఆధారాలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. మంత్రి నారాయణ నివాసంలోను సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. నారాయణ పైన గతంలోను పలు కేసులు నమోదయ్యాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి రాజధాని తదితర కేసులు ఉన్నాయి. దీంతో పాటు పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రాల లీకేజీ కేసు కూడా నమోదయింది. ఈ కేసుకు సంబంధించి వివరాల కోసం కూడా సీఐడీ ఆధికారులు సోదాలు నిర్వహిస్తుందని చెబుతున్నారు.
పీ నారాయణ తెలుగు దేశం ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అంతకుముందే నారాయణ విద్యా సంస్థల చైర్మన్ గా సుపరిచితులు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. కొత్త రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి ప్రణాళికలోను భాగస్వామ్యం కల్పించారు. నాడు ఎన్నికల అఫిడవిట్ లో రూ.477 కోట్ల ఆదాయాన్ని చూపించారు. అప్పుడు దేశంలో అత్యంత సంపన్న మంత్రుల్లో ఒకరిగా నిలిచారు.