»Minsiter Talasani Srinivas Yadav Make Sensational Comments On Dogs
talasani:తలసాని కాంట్రవర్సీ కామెంట్స్.. మనుషులు ఎంత అవసరమో.. జంతువులు కూడా
talasani:అంబర్ పేటలో వీధికుక్కల దాడితో చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. సమాజంలో మనుషులు ఎంత అవసరమో.. జంతువులు కూడా అంతే అవసరం అన్నారు. అంటే చిన్నారులు చనిపోయినా ఏం కాదా అని విపక్షాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
minsiter talasani srinivas yadav make sensational comments on dogs
talasani:అంబర్ పేటలో వీధికుక్కల దాడితో చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. సమాజంలో మనుషులు ఎంత అవసరమో.. జంతువులు కూడా అంతే అవసరం అన్నారు. అంటే చిన్నారులు చనిపోయినా ఏం కాదా అని విపక్షాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చిన్నారి ప్రదీప్ (pradeep) మృతితో ప్రభుత్వం అలెర్ట్ కాదని తలసాని చెప్పారు. వీధికుక్కల అంశంపై చాన్నాళ్ల నుంచి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
మేయర్ (mayor) గద్వాల విజయలక్ష్మీ వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారని తలసాని (talasani) మండిపడ్డారు. బాలుడి మృతి ఘటన ఏ విధంగా చూసినా బాధాకరం అన్నారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఎవరో సలహా ఇస్తే తాము తీసుకోబోమని తలసాని అన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమకు తెలుసని స్పష్టం చేశారు. నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని మంత్రి తలసాని అంగీకరించారు. ప్రజల భద్రత, జీవాల సంరక్షణకు ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించాలని అధికారులను ఆదేశాలు జారీచేశామని వివరించారు.
వీధి కుక్కలు (straydogs) హైదరాబాద్లో స్వైరవిహరం చేస్తున్నాయి. అంబర్ పేట (amberpet) ఘటనతో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంబర్ పేట తర్వాత చైత్యనపురి.. అటు నుంచి కరీంనగర్లో (karimnagar) కూడా స్ట్రీట్ డాగ్స్ రెచ్చిపోయాయి. వరస ఘటనలతో కుక్కల బెడదపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
గ్రేటర్ పరిధిలో రోజుకు 300 మందికి (300) పైగా కుక్కకాటుకు గురవుతారని తెలిసింది. కొత్తపేట (kothapeta) మారుతినగర్ రోడ్ నంబర్ 19లో రిషి అనే బాలుడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. ఈ నెల 8వ తేదీన కొంపల్లిలో ఆరేళ్ల చిన్నారి రమ్య (ramya), 15వ తేదీన భార్గవి (bhargavi), గత నెల 11వ తేదీన తను శ్రీపై కుక్కల దాడి చేశాయి. హైదరాబాద్ జిల్లాలో 2017 నుంచి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్- మల్కాజిగిరిలో 6 వేలు, రంగారెడ్డిలో 25 వేలు, వికారాబాద్లో 20 వేల కేసులు ఉన్నాయి. తనను కుక్క కరిచిందని గతంలో హైకోర్టు జడ్జీ ఒకరు చెప్పడంతో కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ పరిధిలో 5.75 లక్షల కుక్కలు ఉన్నాయని మేయర్ చెబుతున్నారు.