NLR: నాయుడుపేట మండలం చిగురుపాడు అగ్రహారం రహదారి చిన్నపాటి వర్షం కురిసిన బురదమయంగా మారుతోందని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిగురుపాడు అగ్రహారంతో పాటు STకాలనీలకు ఈ రహదారిపై నుంచే ప్రజలు రాకపోకలు జరుపుతున్నారు. ఈ రహదారిపై వాహనాల్లో పోవాలంటే నరకప్రాయంగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి నిర్మాణం చేయాలని కోరుతున్నారు.