ELR: సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్స్ జీతాలు చెల్లించాలని యూనియన్ గౌరవాధ్యక్షులు డేగా ప్రభాకర్ ఏలూరు జిల్లా కలెక్టర్ కే.వెట్రి శెల్వికి మంగళవారం వినతి పత్రం అందించారు. ప్రజలకు గోదావరి జలాలను మంచినీరుగా అందించడానికి భగవాన్ సత్యసాయి ఈ మంచినీటి పథకం వారి ట్రస్ట్ తరపున ఏర్పాటు చేశారన్నారు. 14 నెలలుగా వర్కర్లకు జీతాలు లేవన్నారు.