కేరళ ప్రభుత్వం శబరిమల భక్తులకు శుభవార్త చెప్పింది. శబరిమల వద్ద ప్రతిపాదిత రోప్‌వే ఏర్పాటుకు స్కెచ్ రిలీజ్ చేసింది. ఈ మండల కాలంలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రోప్‌వేతో సన్నిధానం నుంచి పంబ చేరుకోవడానికి 10 నిమిషాలు పడుతుందని దేవస్వోమ్ బోర్డు ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ తెలిపారు. రూ.250 కోట్ల అంచనా వ్యయం కాగా, 2.7 కిలోమీటర్లు, 5 టవర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్ట్ 18 నెలల్లో పూర్తి కానుంది.