AP: రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కప్పట్రాళ్ల యురేనియం తవ్వకం కోసం సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో దీన్ని వ్యతిరేకించిన టీడీపీ.. ఇప్పుడు తవ్వకాలు జరిపితే ఎలా అని ప్రశ్నించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ఆపితే.. ఉద్యమం తప్పదని హెచ్చరించారు.