»Us President Joe Biden Once Again Slipped Air Force One
Joe Biden slipped విమానం మెట్లపై తుళ్లిపడ్డ అమెరికా అధ్యక్షుడు
స్వల్ప ఘటన కావడంతో బైడెన్ కు గాయాలేమీ కాలేదు. అయితే బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ లో ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి పడడం ఇది మూడోసారి. అంతకుముందు 2021లో జార్జియా నుంచి బయల్దేరే సమయంలో అదుపు తప్పి జారి పడిపోయారు. అయితే వెంటనే తేరుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ లో రహాస్య పర్యటన చేసి సంచలనం రేపాడు. ప్రొటోకాల్ ను పక్కనపెట్టి నిత్యం వాడే విమానం కాకుండా చిన్న విమానంలో వెళ్లాడు. అక్కడి నుంచి రైలు ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రయాణం అనంతరం తిరుగు ప్రయాణంలో విమానం ఎక్కుతూ మెట్లపై తుళ్లి పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే బైడెన్ కిందపడడం ఇది మొదటిసారి కాదు. గతంలో పలుసార్లు తుళ్లిపడ్డాడు.
ఉక్రెయిన్, పోలాం పర్యటన ముగించుకుని బైడెన్ తిరుగు ప్రయాణమయ్యాడు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోకి ఎక్కుతుండగా బైడెన్ కాలు అదుపు తప్పింది. దీంతో మెట్లపై జారి పడ్డాడు. అయితే ఆ వెంటనే తేరుకుని పైకి లేచి చకచకా విమానం లోపలికి వెళ్లాడు. స్వల్ప ఘటన కావడంతో బైడెన్ కు గాయాలేమీ కాలేదు. అయితే బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ లో ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి పడడం ఇది మూడోసారి. అంతకుముందు 2021లో జార్జియా నుంచి బయల్దేరే సమయంలో అదుపు తప్పి జారి పడిపోయారు. అయితే వెంటనే తేరుకున్నారు. అనంతరం 2022లో ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కడంలో బైడెన్ తత్తరపడుతున్నాడు. అమెరికా సమ్మిట్ కు హాజరయ్యేందుకు వెళ్తూ లాస్ ఏంజిల్స్ లో కూడా బైడెన్ ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు.
Biden, once again, falls up the stairs on AF1…after the White House Doctor stated that, “Joe Biden remains a healthy, vigorous, 80-year-old male…who’s fit…” pic.twitter.com/IaVq64QF4k