SDPT: భారత జనగణన-2027 ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ప్రజలకు, అధికారులకు అవగాహన కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కే. రమేష్ కుమార్ తెలిపారు. దుబ్బాక పట్టణంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆటపాటల ద్వారా జనగణన ప్రాముఖ్యతను వివరించారు. దేశ భవిష్యత్, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన కీలకమని, ప్రతి ఒక్కరూ వివరాలు నమోదు చేయించుకున్నారు.