TPT: అలిపిరి సమీపంలో రోడ్డుపై ఉన్న చిరు వ్యాపారాలను పోలీసులు, మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో తొలగించారు. విషయం తెలుసుకున్న CITU నేతలు అక్కడికి చేరుకుని తొలగింపును అడ్డుకున్నారు. దీంతో వారిని నిలువరించే ప్రయత్నం చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సుబ్రహ్మణ్యం సహా పలువురిని అరెస్ట్ చేసి వెస్ట్ PSకు తరలించారు.