W.G: ఆకివీడు ఆనవాలు చెరువు గట్టు వద్ద గల ఒక పూరిల్లుపై శనివారం ఉదయం తాటిచెట్టు విరిగిపడింది. తెల్లవారుజామున ఆకివీడు ప్రాంతంలో ఈదురు గాలులు వీచడంతో ఈ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, కాలనీవాసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.