KRNL: గూడూరు మండలం పొన్నకల్లులో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మూడు గడ్డివాములు కాలిపోయాయి. మిన్నల్ల, రాముడు, నాగన్నకు చెందిన పశువుల మేతగా నిల్వ చేసిన వేరుశనగ పొట్టు బూడిదైంది. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు ఇవాళ తెలిపారు. పశువులకు మేత లేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.