NLR: స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని అన్ని వార్డులలో శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చెత్తను తొలగించడం, కాలువలు శుభ్రపరిచే పనులు చేపట్టారు. ఉదయం నుంచే పారిశుద్ధ్య సిబ్బంది అన్ని వార్డుల్లో పనిచేయడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.