ATP: గుంతకల్లు ప్రభాత్ నగర్ రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన రోజ్ గార్ మేళా కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రైల్వే ఆఫీసర్స్ అతిథి గృహంలో ఆయనను కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ పి.జగదీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.