JN: కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి రైతు నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఏఈవోలకు సూచించారు. రైతు భీమా, డిజిటల్ క్రాప్ సర్వే, మట్టి పరీక్షలు, ఫోన్ నంబర్ అప్డేట్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.