»Bihar Upendra Kushwaha Resigns To Jdu And Formed New Party Is Rljd
Bihar CMకు షాక్.. దేశంలో అవతరించిన కొత్త పార్టీ
నితీశ్ పై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు గౌరవం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నితీశ్ పై బాహాటంగా విమర్శలు చేశారు. ఒంటరిగా మారడంతో జేడీ(యూ)ను వదిలేసి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఉపేంద్రకు ఎవరికీ ఇవ్వనంత గౌరవం ఇచ్చామని పేర్కొన్నారు. వివాదం ముదరడంతో జేడీయూలో ఉపేంద్ర ఒంటరిగా మారారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీని వీడి కొత్త పార్టీని స్థాపించారు.
దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు చాలా పార్టీలు తహతహలాడుతున్నాయి. నరేంద్ర మోదీ పాలనపై ఉన్న వ్యతిరేకతను సొంతం చేసుకునేందుకు వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మోదీకి దీటుగా నిలబడతామని పలువురు ప్రముఖులు భావిస్తున్నారు. ఆ కోవలోనే బిహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నారు. నితీశ్ కుమార్ (Niteesh Kumar) జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు సొంత పార్టీ నాయకుడు ఊహించని షాకిచ్చాడు. పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ స్థాపించాడు. దీంతో బిహార్ లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) (Janatadal United Party) సీనియర్ నాయకుడు, పార్టీ పార్లమెంటరీ బోర్డ్ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ (Upendra Kushwaha) సీఎం నితీశ్ కుమార్ తో విబేధించారు. కొద్దికాలంగా నితీశ్ పై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు గౌరవం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నితీశ్ పై బాహాటంగా విమర్శలు చేశారు. ఒంటరిగా మారడంతో జేడీ(యూ)ను వదిలేసి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. రాష్ట్రీయ లోక్ జనతా దళ్ (RLJD) పేరిట పార్టీ స్థాపించినట్లు సోమవారం ఉపేంద్ర ప్రకటించారు. ఈ పార్టీకి తాను జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతానని తెలిపారు. ప్రస్తుతం నితీశ్ కుమార్ తీరు పూర్తిగా మారిందని ఆరోపించారు. అతను సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని, చుట్టూ చేరిన కొటరీ సలహాలు పాటిస్తున్నారని ఉపేంద్ర కుష్వాహ తెలిపారు.
‘రెండు రోజులుగా నిర్వహించిన సమావేశాలకు పెద్ద సంఖ్యలో జేడీయూ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. కొత్త పార్టీ ఏర్పాటుకు వారంతా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ లోక్ జనతా దళ్ పార్టీని స్థాపించాం. నూతన రాజకీయ అధ్యాయం ఆరంభమైంది. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యత్వానికి (MLC) రాజీనామా చేస్తున్నా. జేడీయూ పార్టీలో కొంత మంది మినహా అందరూ అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే వారంతా మాతో కలుస్తారు’ అని ఉపేంద్ర ప్రకటించారు.
బిహార్ లో ఉపేంద్ర కీలక నాయకుడు. గతంలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (RLSP) పార్టీ ఉండగా జేడీయూలో విలీనం చేశాడు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ నితీశ్ తో కలిసినప్పటి నుంచి ఉపేంద్రకు నితీశ్ కు మధ్య విబేధాలు మొదలయ్యాయి. తేజస్వికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో వీరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే ఉపేంద్ర నితీశ్ పై బహిరంగ విమర్శలు చేశారు. వీటిని మాత్రం నితీశ్ కొట్టి పారేశారు. ఉపేంద్రకు ఎవరికీ ఇవ్వనంత గౌరవం ఇచ్చామని పేర్కొన్నారు. వివాదం ముదరడంతో జేడీయూలో ఉపేంద్ర ఒంటరిగా మారారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీని వీడి కొత్త పార్టీని స్థాపించారు.