తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ జాతీయ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా రోజున ఆ పార్టీ పేరు, వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రధాన మంత్రి అయినట్లు కలలు కంటున్నారంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
దేశంలో పచ్చి అబద్ధాలు అడే కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కావాలనే కేంద్రం పై విష ప్రచారం చేస్తున్నారన్న ఆయన కెసిఆర్ ప్రధాని అయినట్టు ఆయన కూతురు ముఖ్య శాఖ నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ సీఎం అయినట్లు ఆ కుటుంబం పగటి కల కంటుందని అన్నారు.
ఉత్తర కుమార మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న ఆయన దేశంలో ఏ పార్టీ కూడా ఆయనతో కలిసి రావడం లేదని, ఆయనను కలిసిన నేతలు కూడా ఆ మాటలు మేము అన లేదు అని వివరణ ఇచ్చుకుంటున్నారని అన్నారు. జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో అర్థం కాక ప్రగతి భవన్ ముందే తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందని, అందరూ అసహ్యించుకుంటున్నారని అన్నారు.
మజ్లిస్ పార్టీ కోసమే కేసీఆర్ పార్టీ పెడుతున్నారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారని, కిషన్ రెడ్డి అన్నారు. ఎంఐఎం, వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, అన్నాడీఎంకేలు కూడా జాతీయ పార్టీలే అని, దేశంలో పార్టీలు రావడం, పోవడం కొత్త కాదని అన్నారు.
కేసీఆర్ చెప్పిన ప్రళయం ఎంటోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూశారని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క సీటు లేని జాతీయ పార్టీలు ఉన్నాయని, ఎవరు ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని అన్నారు. పీకే కూడా ఈ పార్టీ గెలవదు అని పెట్టే బేడ సర్దుకుని పోయాడు అంట, కెసిఆర్ తనను తిట్టి పంపించాడు అని ఆయన స్నేహితులకు పీకే చెప్పాడని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.