PKL సీజన్ 10 రన్నరప్ హర్యానా స్టీలర్స్ PKL 11వ సీజన్లో హ్యాట్రిక్ కొట్టింది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో నిరాశపర్చిన స్టీలర్స్ తర్వాత మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. HYDలో జరిగిన ప్రోకబడ్డీ లీగ్ మ్యాచ్లో UP యోధాస్పై 30-28తో స్టీలర్స్ గెలుపొందింది. 4 మ్యాచుల్లో హర్యానా స్టీలర్స్కు ఇది మూడో విక్టరీ. UP యోధాస్కు 5 మ్యాచుల్లో ఇది రెండో పరాజయం.