Project K : 'మహానటి' తర్వాత టాలెటెండ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'ప్రాజెక్ట్ కె' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
‘మహానటి’ తర్వాత టాలెటెండ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కె’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా.. అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికా కానుకగా జనవరి 12 రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అందులో జస్ట్ ఒక హ్యాండ్‌ని మాత్రమే చూపించారు. అది కూడా భారీ యుద్ధాన్ని తలపించేలా ఉండడంతో.. నాగ్ అశ్విన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలోను హ్యాండ్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. దాంతో ప్రాజెక్ట్ కె కథకి హ్యాండ్‌తో ఉన్న సంబంధం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగానే.. ప్రాజెక్ట్ కెలో మరో యంగ్ హీరో కూడా కనిపించబోతున్నాడనే రూమర్ వైరల్‌గా మారింది. లాస్ట్ ఇయర్ ‘సీతారామం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు మళయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమాను ప్రాజెక్ట్ కె నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్‌నే నిర్మించింది. అందుకే ప్రాజెక్ట్ కెలో దుల్కర్ కూడా ఉండే ఛాన్స్ ఉందని సాలిడ్ బజ్ వినిపిస్తోంది. సీతారామం ప్రమోషన్లో భాగంగా.. ప్రాజెక్ట్ కె పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు దుల్కర్. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కెలో ఉన్నాడనే టాక్ ఊపందుకుంది. కాబట్టి ఇందులో నిజం లేదని చెప్పడం కష్టమే. ఒకవేళ దుల్కర్.. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం అదిరిపోతుందనే చెప్పొచ్చు. ఏదేమైనా ప్రాజెక్ట్ కె పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.