dont do this mistakes:శివరాత్రి ఉపవాసం, జాగారంలో ఈ తప్పులు చేయకండి
ఆవు పాలు (cow milk), స్వచ్ఛమైన నీటితో (water) శివలింగం అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేసే సమయంలో శరీరంపై ఉన్న చెమట, వెంట్రుకలు శివుడిపై పడకూడదు. శివరాత్రి పర్వదినాన మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలనే నియమం ఏమీ లేదు. నిష్టగా శివుని ఆరాధించే వారికి ఆయన అనుగ్రహం కలుగుతుంది.
dont do this mistakes:మహాశివరాత్రి (maha shivaratri) రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. మరికొందరు రాత్రంతా జాగారం చేస్తారు. ఆ శివ (shiva) నామస్మరణ చేస్తుంటారు. అయితే ఉపవాసం ఉండేప్పుడు కానీ.. జాగారం చేసే సమయంలో కానీ కొన్ని తప్పులు చేస్తుంటారు. దాని వల్ల చేసిన పూజా ఫలం ఉండదు. అందుకోసమే పొరపాట్లు చేయొద్దని పెద్దలు చెబుతున్నారు.
ఈ తప్పులు చేయకండి
ఆవు పాలు (cow milk), స్వచ్ఛమైన నీటితో (water) శివలింగం అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేసే సమయంలో శరీరంపై ఉన్న చెమట, వెంట్రుకలు శివుడిపై పడకూడదు. శివరాత్రి పర్వదినాన మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలనే నియమం ఏమీ లేదు. నిష్టగా శివుని ఆరాధించే వారికి ఆయన అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజున మద్యం (liquor) సేవించడం, ధూమపానం చేయద్దు. దీంతో చేసిన పూజకు ఫలితం ఉండదు. పర్వదినాన భార్యాభర్తల కలయిక కూడా పూజ ఫలితాన్ని అందించదు. నిష్టగా మనసు లగ్నం చేసి శివుని (shiva) ఆరాధించిన వారికి సకల శుభాలు కలుగుతాయి.
సినిమాలు చూడొద్దు
తన స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే జాగరణం. ఆ రోజే మన జీవితంలో శివరాత్రి (shivaratri). శివరాత్రి కాబట్టి జాగరణ చేయాలని సినిమాలు చూడటం, ఇతర పనులు చేయడం సరికాదు. శివరాత్రి రోజున ఆహారం తీసుకోరాదని, రకరకాల తీర్థాలు జాముజాముకి తీసుకుని, ఉపవాసం చేశామని అనుకోకూడదు. ఉప అంటే దగ్గర.. జీవాత్మ పరమాత్మకు సమీపంలో ఉండడం.
నాలుగు జాములు
యామం అంటే జాము. మహాశివరాత్రి రోజు రాత్రి ప్రతి యామంలో శివునికి అభిషేకం చేయాలి. అలా నాలుగు జాములు ఉంటాయి. నాలుగో జాముతో తెల్లవారుతుంది. ఆ రోజు స్నానాదికాలు చేసుకొని.. శివ లింగానికి ఉపహారం పెట్టి, కదిలించడంతో జాగారం ముగుస్తోంది. శివరాత్రి పర్వదినాన భక్తి పారవశ్యంలో మునిగి తేలే భక్తులకు మంచి కలుగుతుంది. శివనామం సర్వ మానవాళికి శివైక్యం చెందెందుకు పరమ మార్గం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
తేనేతో అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి పర్వదినం రోజున శివలింగాన్ని తేనెతో (honey) అభిషేకిస్తే చాలా మంచిది. చేసే ఉద్యోగంలో సమస్యలు ఉన్నప్పుడు.. వృత్తి జీవితంలో ఒడిదొడుకులు దూరం చేసుకోవడానికి అభిషేకం చేస్తే మేలు జరుగుతుంది. శివరాత్రిన ఈ పూజ చేసుకున్న వారికి శివానుగ్రహం ఉంటుంది. శివలింగాన్ని పెరుగుతో అభిషేకిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి అప్పులు తీరుతాయి. చెరుకురసంతో రుద్రాభిషేకం చేస్తే లక్ష్మీ దేవి ప్రసన్నురాలు అవుతుంది. సంపద చేకూరి.. దారిద్రం నాశనం అవుతుంది.