Bilva pathram:మహాశివునికి బిల్వ పత్రం అంటే ఎందుకు ప్రీతి!
Bilva pathram:మహా శివరాత్రి.. (shivaratri) హిందువుల ముఖ్యమైన పండుగ. ఇంట్లో పూజ చేసే వారు గోగుపూలు, మారేడు, బిల్వ (bilva) దళాలను సమర్పిస్తారు. వీటిలో బిల్వ పత్రం శ్రేష్టం అని పురాణాలు చెబుతున్నాయి. బిల్వ దళంలో మూడు ఆకులు ఉంటాయి. అవీ సత్త్వ, రజ, తమో గుణాలు.. ఇవీ శివుని మూడు నేత్రాలకు ప్రతీక.. త్రిశూలానికి సంకేతం.
Bilva pathram:మహా శివరాత్రి.. (shivaratri) హిందువుల ముఖ్యమైన పండుగ. మహా శివుని (lord shiva) కోసం భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇంట్లో పూజ చేసే వారు గోగుపూలు, మారేడు, బిల్వ (bilva) దళాలను సమర్పిస్తారు. వీటిలో బిల్వ పత్రం శ్రేష్టం అని పురాణాలు చెబుతున్నాయి. బిల్వ పత్రాన్ని మారేడు దళం అని కూడా పిలుస్తారు. బిల్వ దళంలో మూడు ఆకులు ఉంటాయి. అవీ సత్త్వ, రజ, తమో గుణాలు.. ఇవీ శివుని మూడు నేత్రాలకు ప్రతీక.. త్రిశూలానికి సంకేతం. బిల్వ పత్రంలో మూడు ఆకుల్లో కుడువైపు విష్ణువు, ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు కొలువై ఉంటారు.
సృష్టి ప్రారంభం..
బ్రహ్మ (brahma), విష్ణుతో (vishnu) సహా అగ్ని లింగం నుంచి సృష్టి ప్రారంభమైందని శివపురాణం చెబుతోంది. శివరాత్రి రోజున రాత్రి శివ (shiva) లింగానికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. లింగంపై బిల్వపత్రం ఉంచి పూజ చేయడంతో శివ అనుగ్రహం లభిస్తోందట. శివారాధన కోసం బిల్వాష్టకం రాశారు.
శివుని ప్రసన్న కోసం
పర్వత రాజ కుమార్తె పార్వతి (parvathi), శివుడిని (shiva) పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. సతీ వియోగంలో మహాద్యానంలో ఉన్న శివుని ప్రసన్నం చేసుకునేందుకు తప్పస్సు చేసింది. ఉపవాసాలు.. ఎన్నో పూజలు చేసింది. బిల్వ వృక్షం కింద మహాదేవుడు తప్పస్సు చేస్తున్న సమయంలో పార్వతి శివ పూజకు సంబంధించిన పూజా సామాగ్రి తీసుకురావడం మరచిపోయింది. అక్కడే పడి ఉన్న బిల్వపత్రాలను పుష్పాలుగా ఉపయోగించి పూజ చేసింది. వాటితో శివుడిని పూర్తిగా కప్పేసింది. ఆ పూజ ఆయనకు నచ్చి సంతోషించాడట. అప్పటి నుంచి శివారాధనకు బిల్వపత్రాలను ఉపయోగిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి.
కష్టాలు తీరతాయి..
మహా శివరాత్రి రోజున బిల్వ పత్రాలను (Bilva pathram) సమర్పించిన భక్తులకు ఆర్థిక కష్టాలు తీరుతాయి. అన్ని రకాలుగా సంవృద్ధి కలుగుతుంది. శివరాత్రిన ప్రత్యేకంగా బిల్వార్చన చేస్తారు. దంపతులు బిల్వ పత్రాలతో శివపూజ చేసుకుంటే వారి దాంపత్య జీవితం అనందంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. సోమ, మంగళ, శుక్రవారాల్లో బిల్వ పత్రాన్ని తెంపొద్దు. సంక్రమణం, అసౌచం, రాత్రి సమయంలో కూడా కోయొద్దట. పూజలో వినియోగించే పత్రంలో మాత్రం తప్పనిసరిగా మూడు ఆకులు ఉన్న బిల్వాన్ని ఉపయోగించాలని పురాణాల ద్వారా తెలుస్తోంది.
అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి పర్వదినం రోజున శివలింగాన్ని తేనెతో (honey) అభిషేకిస్తే చాలా మంచిది. చేసే ఉద్యోగంలో సమస్యలు ఉన్నప్పుడు.. వృత్తి జీవితంలో ఒడిదొడుకులు దూరం చేసుకోవడానికి అభిషేకం చేస్తే మేలు జరుగుతుంది. శివరాత్రిన ఈ పూజ చేసుకున్న వారికి శివానుగ్రహం ఉంటుంది. శివలింగాన్ని పెరుగుతో అభిషేకిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి అప్పులు తీరుతాయి. చెరుకురసంతో రుద్రాభిషేకం చేస్తే లక్ష్మీ దేవి ప్రసన్నురాలు అవుతుంది. సంపద చేకూరి.. దారిద్రం నాశనం అవుతుంది.