Maha shivaratri:మహాశివరాత్రి అంటే ఏంటీ? శివుడిని ఎలా పూజించాలి?
Maha shivaratri:మహా శివరాత్రి.. (Maha shivaratri) హిందువులకు ప్రధాన పండుగ. ఈ రోజే శివుడు (lord shiva) లింగాకారంలో ఆవిర్భవించారు. శివుడు గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి (Maha shivaratri) అని కూడా చెబుతుంటారు. అందుకే భక్తులు ఉపవాసం ఉంటారు.. మరికొందరు జాగారం చేస్తారు.
Maha shivaratri:మహా శివరాత్రి.. (Maha shivaratri) హిందువులకు ప్రధాన పండుగ. ఈ రోజే శివుడు (lord shiva) లింగాకారంలో ఆవిర్భవించారు. శివుడు గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి (Maha shivaratri) అని చెబుతుంటారు. అందుకే భక్తులు ఉపవాసం ఉంటారు.. మరికొందరు జాగారం కూడా చేస్తారు. మహా శివరాత్రి నేపథ్యం గురించి తెలుసుకుందాం పదండి.
బ్రహ్మ విష్ణుల మధ్య గొడవ
శివరాత్రికి సంబంధించి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్వం బ్రహ్మ (brahma), విష్ణువు (vishnu) మధ్య ఎవరు గొప్ప అనే అంశంపై గొడవ జరిగిందట. శివుడు (shiva) జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. శివలింగానికి ఆది, అంతాలను బ్రహ్మ, విష్ణువులు కనిపెట్టమని చెప్పారట. ఆశ్చర్యంతో చూస్తుండగా అది పెరగడం ప్రారంభిస్తుంది. భూమిని చీల్చుకొని పాతాళానికి, నింగిని ఛేదించుకుంటూ విస్తరిస్తుంది. అప్పుడు బ్రహ్మ విష్ణువు ఇద్దరూ ఆ శివలింగం ఆద్యంతాలు చూడటానికి సిద్ధమవుతారు. బ్రహ్మదేవుడు హంసలా మారిపోయి ఆకాశంలోకి ఎగిరి వెళతాడు. విష్ణువు వరాహంగా మారి, నేలను చీల్చుకుంటూ పాతాళానికి చేరతాడు. ఇద్దరూ ఎంత దూరం వెళ్లినా, శివలింగం అంతాన్ని చూడలేకపోతారు. తిరిగి యథా స్థానానికి చేరుకుంటారు. వారి ఎదుట పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. తాను శివలింగం అంతాన్ని చూశానని బ్రహ్మదేవుడు తప్పు చెబుతాడు. విష్ణువు మాత్రం నిజమే చెబుతాడు. తప్పు చెప్పిన బ్రహ్మకు లోకంలో పూజార్హత ఉండదని శివుడు శపిస్తాడు. శివ దూషణను కాలభైరవుడు సహించలేకపోతాడు. శివుడి జటాజూటం నుంచి ఆవిర్భవించి, బ్రహ్మ అయిదో తలను ఖండిస్తాడు. బ్రహ్మ విష్ణువు ఇద్దరూ శివమహిమను అంగీకరించారని పురాణ గాథలు చెబుతున్నాయి.
లింగకారంలో ఉద్బవం
మాఘమాసం బహుళ చతుర్ధశి రోజున శివుడు (shiva) లింగకారంలో ఉద్బవించాడు. శివరాత్రి రోజే ఆవిర్భవించడంతో ఉపవాసం.. జాగరం చేస్తారు. అలా చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. శివ అంటే మంగళకరం, శుభప్రదం అనే అర్థం వస్తోంది. ప్రళయ కాళరాత్రి తరువాత జగన్మాత కోరిక మేరకు శివుడు మళ్లీ జీవకోటిని ఉద్భవింపచేసినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. శివరాత్రికి ముందు ఒక్క రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. శివరాత్రి పర్వదినం రోజున ఉదయం స్నానాదులు పూర్తి చేసుకొని శివదర్శనం చేసుకొని శివనామస్మరణతో ఉపవాసం వుండాలి. రాత్రివేళలో శివలింగానికి పూజ చేస్తూ జాగరణ చేయాల్సి ఉంటుంది. ఉపవాసం ఉండి, జాగరం చేసి, బిల్వార్చన, అభిషేకంలో పాల్గొంటే శివానుగ్రహం లభిస్తుంది. నిండు మనస్సుతో, భక్తితో పిలిస్తే చాలు ఆ లింగమూర్తి మనకు ప్రత్యక్షం అవుతాడు.
జన్మాష్టమి నుంచి 180 రోజులు
లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు (180 days) లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు, జ్యోతిరూపంలో, లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైంది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసం ఉండి, మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్షను స్త్రీలు, పురుషులు కూడా ఆచరించవచ్చు.
శివరాత్రి అంటే ఏంటీ?
పార్వతీదేవి శివరాత్రి (shivaratri) గురించి శివుడిని అడుగుతుంది. శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఏమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నాసరే సంతోషిస్తానని చెబుతాడు. ఆ రోజు పగలు నియమ నిష్ఠతో ఉపవాసం ఉండి, రాత్రి నాలుగు జాముల్లో శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటారు పరమశివుడు.
జాగరణ
మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయం అన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు ‘బిల్వ’ మూలంలో ఉంటాయనీ, శివరాత్రి రోజున ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి (shivaratri) అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మ జ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రి రోజున ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తి కలుగుతుంది. శక్తి ఉన్నవారు బంగారం, వెండి కుందులలో ఆవు నేతి దీపం వెలిగించి పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలు చెబుతారు. శివరాత్రి రోజున ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, ఏడాదిపాటు నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని శివుడు బ్రహ్మదేవునికి చెప్పాడట.
ఇలా దర్శించుకోవాలి
శివాలయములో (shiva temple) ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలా వస్తే పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది. బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది. బిల్వ దళం పొరబాటున కాలికి తగిలితే ఆయుష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ. బిల్వం ఇంటి అవరణంలో ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.