»Another Time Armoor Mla Jeevan Reddy Murder Conspiracy
armoor mla jeevan reddy:ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర, అరెస్ట్
armoor mla jeevan reddy:ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (jeevan reddy) హత్యకు మరోసారి కుట్ర జరిగింది. ఇదివరకు ప్రసాద్ గౌడ్ (prasad goud) అనే వ్యక్తి కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అతనే కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు.
armoor mla jeevan reddy:ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (jeevan reddy) హత్యకు మరోసారి కుట్ర జరిగింది. ఇదివరకు ప్రసాద్ గౌడ్ (prasad goud) అనే వ్యక్తి కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అతనే కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ కంఠేశ్వర్ హౌసింగ్ బోర్డు కాలనీలో బొంత సుగుణ (bonta suguna) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే హత్య కోసం ఆమె ఇంట్లో నిల్వచేసిన గిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై (jeevan reddy) నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన ప్రసాద్ గౌడ్ (prasad goud) గతంలో కూడా హత్యాయత్నం చేశాడు. గత ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో గల ఎమ్మెల్యే ఇంట్లోకి తుపాకీతో చొరబడ్డాడు. అతడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో నిజామాబాద్‌కు చెందిన బొంత సుగుణ అనే మహిళకు తుపాకీ కొనడం కోసం రూ. 60 వేలు ప్రసాద్ గౌడ్ పంపినట్టు తెలిసింది. ఆమెను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు.
నెల రోజులకు వీరిద్దరూ బెయిల్ (bail) మీద బయటకు వచ్చారు. జీవన్ రెడ్డిని హత్య చేయాలని మరోసారి పథకం వేశారు. ఇతర వ్యక్తుల పేలుడు పదార్థాలు సమకూర్చారట. పక్క సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అంతకుముందు ఈ కేసులో నిందితురాలుగా ఉన్న బొంత సుగుణ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు పట్టుబడటంతో అరెస్ట్ చేశారు. ఇతరుల ద్వారా ప్రసాద్ గౌడ్ పేలుడు పదార్థాలు పంపించాడని ఆమె అంగీకరించింది. నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 37 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బొంత సుగుణ ఏ1గా, ప్రసాద్ గౌడ్ ఏ2గా చేర్చారు.
నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం కల్లెడ సర్పంచ్ లావణ్య ప్రసాద్ గౌడ్‌పై (lavanya) అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు సస్పెండ్ చేశారు. తన భార్యను సస్పెండ్ చేశారనే కక్షతో ఎమ్మెల్యే హత్యకు ప్రసాద్‌గౌడ్ కుట్ర పన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లో గల జీవన్‌రెడ్డి నివాసానికి ప్రసాద్‌గౌడ్ వెళ్లాడు. నేరుగా జీవన్‌రెడ్డి పడకగదిలోకి (bedroom) వెళ్లారు. తన జేబులో ఉన్న పిస్తోలు తీసి జీవన్‌రెడ్డి నుదుటికి గురిపెట్టారు. తనకు న్యాయం చేయాలని, లేదంటే చంపేస్తానని బెదిరించారు. షాక్ నుంచి తేరుకున్న జీవన్‌రెడ్డి గట్టిగా అరవడంతో వంటమనిషి గంగాధర్ మిగతా సిబ్బంది అక్కడికి వచ్చారు. ప్రసాద్‌గౌడ్‌ను వెనుక నుంచి పట్టుకున్నారు. అతడి జేబులో కత్తి కూడా ఉందని గుర్తించారు. సిబ్బంది, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జీవన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ప్రసాద్‌గౌడ్‌పై హత్యాయత్నం, అక్రమ చొరబాటు, ఆయుధాల వాడకం, బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలో మావోయిస్టు సానుభూతిపరుడిగా ప్రసాద్ ఉన్నారని తెలిసింది.