AP: విశాఖ ముఖచిత్రం ఈరోజు నుంచే మారబోతోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ భూమిపూజ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కొత్త చరిత్ర పునాది వేసిన పవిత్రమైన రోజు ఇది. ఈరోజు కేవలం భూమిపూజ మాత్రమే కాదు. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. ఇప్పటినుంచి విశాఖ.. డేటా ఏఐ హబ్‌గా పిలుచుకోబోతున్నాం’ అని పేర్కొన్నారు.