KTR : అందరికీ ఒకే అబద్దం నేర్పించండి… మోదీకి కేటీఆర్ ట్వీట్..!
KTR : అందరికీ ఒకే అబద్దం నేర్పించాలని... ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని కేంద్రంలోని అధికార పార్టీపై మంత్రి కేటీఆర్ చురకలు వేశారు. తెలంగాణకు వైద్య కళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంత్రులు చెప్పేవన్నీ అబద్దాలని.. కనీసం అబద్ధాలనైనా అందరూ ఒకేలా చెప్పాలని, దాని కోసం కేంద్ర మంత్రులకు సరైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోడీకి సూచించారు.
అందరికీ ఒకే అబద్దం నేర్పించాలని… ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని కేంద్రంలోని అధికార పార్టీపై మంత్రి కేటీఆర్ చురకలు వేశారు. తెలంగాణకు వైద్య కళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంత్రులు చెప్పేవన్నీ అబద్దాలని.. కనీసం అబద్ధాలనైనా అందరూ ఒకేలా చెప్పాలని, దాని కోసం కేంద్ర మంత్రులకు సరైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోడీకి సూచించారు.
నిర్మలా సీతారామన్ తాజాగా తెలంగాణకు మంజూరు చేసిన మెడికల్ కాలేజీల విషయంలో మాట్లాడారు. ఆ మాటలకు స్పందించిన మంత్రి కేటీఆర్ గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మనుసుఖ్ మాండవీయ తదితరులు చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తుచేస్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయని తెలిపారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు కోరుతూ తెలంగాణ నుంచి ఎటువంటి ప్రొపోజల్స్ రాలేదని మరోమంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. ఇక తాజాగా నిర్మలా సీతారామన్ తెలంగాణ నుంచి 2 ప్రొపోజల్స్ వచ్చాయని మాత్రమే తెలిపారు.
మంత్రులందరిలోను కిషన్ రెడ్డి జెమ్ వంటివారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గ్లోబర్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిజన్ అనే సంస్థను హైదరాబాద్లో నెలకొల్పుతున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారని, అది కూడా ఒట్టి అబద్దమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు.