తమిళ్ స్టార్ హీరో ధనుష్ యాక్ట్ చేసిన సార్ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సందర్భంగా ఈ మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు చుద్దాం.
తమిళ్ స్టార్ హీరో ధనుష్(dhanush) నటించిన సార్ మూవీ(Sir movie)ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరీ(venky atluri) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా సంయుక్త మీనన్(samyuktha menon) నటించింది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. అయితే తెలుగులో నేరుగా వచ్చిన ధనుష్ మొదటి చిత్రం ఇదేనని చెప్పవచ్చు. గతంలో అనువాద చిత్రాలు మాత్రమే తెలుగులో విడుదలయ్యేవి. సార్ మూవీని తమిళంలో వాతి పేరుతో విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచాయి. అయితే ట్రైలర్ చూస్తే ఈ సినిమా ప్రధానంగా విద్య(education)ను వ్యాపారంగా చేస్తున్న కార్పొరేట్ వ్యవస్థపై హీరో పోరాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇక అసలు ఈ సినిమా స్టోరీ ఎంటో ఇప్పుడు చుద్దాం.
కథ
కథ అంతా కూడా ఒక యువ లెక్చరర్, అతను ప్రైవేట్ కాలేజీల(private colleges) యాజమాన్యాన్ని బలంగా ఎదుర్కొని ఎలా విజయం సాధించాడనేది అసలు స్టోరీ. 2000 సంవత్సరంలో ఇంజినీరింగ్ విద్యకు క్రమంగా భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. అదే అదునుగా భావించిన త్రిపాఠి విద్యా సంస్థల అధినేత(సముద్రఖని)తోపాటు పలువురు విద్యను వ్యాపారంగా భావించి పెద్ద ఎత్తున డబ్బులు దోచుకుంటారు. ఆ నేపథ్యంలో గవర్నమెంట్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లకు అధిక జీతాల ఆశచూపి త్రిపాఠి తనదగ్గరకు రప్పించుకుంటాడు. దీంతో పలు ప్రభుత్వ కాలేజీలు మూతపడతాయి. ఇక ప్రైవేటు కాలేజీల్లో వేలకు వేలు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో విద్యార్థులు చదువు మానేస్తున్నామని ఆందోళనలు చేస్తారు. ఆ క్రమంలో త్రిపాఠి ప్రభుత్వ కాలేజీలను తామే దత్తత తీసుకుని నిర్వహిస్తామని ప్రభుత్వానికి చెబుతాడు. ఆ క్రమంలో త్రిపాఠి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌లో జూనియర్ లెక్చరర్ అయిన బాల గంగాధర్ తిలక్ సార్ (ధనుష్) బోధించడానికి సిరిపురం అనే ప్రదేశానికి బదిలీ చేయబడతారు. అయితే బాలుని సిరిపురం బదిలీ చేయడం వెనుక ప్రధాన కారణం ఏమిటి? త్రిపాఠి మాస్టర్ ప్లాన్ ఏమిటి? నిజం తెలుసుకున్న తర్వాత, త్రిపాఠికి వ్యతిరేకంగా బాలు ఎలా వెళ్తాడు? హీరోకి బయాలజీ లెక్చరర్ మీనాక్షి (సంయుక్త మీనన్), సిరిపురం సర్పంచ్ (సాయి కుమార్)కి ఎంటీ సంబంధం అన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే
ఎలాంటి పాత్రలోనైనా లీనమై నటించే హీరో ధనుష్(dhanush) ఈ చిత్రంలో కూడా తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడని చెప్పవచ్చు. తన సహజ నటనతో లెక్చరర్(lecturer) పాత్రకు న్యాయం చేశాడు. ప్రధానంగా సెకండాఫ్ అంతా ఎమోషనల్ థ్రెడ్‌ని తన భుజాలపై వేసుకుని సినిమా మూడ్‌ని అద్భుతంగా ఎలివేట్ చేశాడు. హీరోయిన్ సంయుక్తా మీనన్ హోమ్లీ లుక్‌లో క్యూట్‌గా ఉంది. డీసెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ, సంయుక్త తన తదుపరి సినిమాలలో తన నటనా నైపుణ్యాలను మెరుగుపరచుకుంది. ధనుష్‌తో ఆమె కెమిస్ట్రీని తెరపై చక్కగా చూపించారు. ఇక సీనియర్ నటుడు సాయికుమార్(sai kumar), నెగటివ్ షేడ్ క్యారెక్టర్లో సముద్రఖని(samuthirakani) వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. మరోవైపు హైపర్ ఆది(hyper aadi), నరేన్ వంటి ఇతర ఆర్టిస్టులు తమ పాత్రల్లో డీసెంట్‌గా నటించారు.
విశ్లేషణ
తన గత చిత్రాలతో పోలిస్తే ప్రేమ కుటుంబ కథలను డీల్ చేసిన వెంకీ అట్లూరి(venky atluri) ఈ చిత్రంలో సామాజిక అంశాలతో కూడిన కథను చెప్పడానికి ప్రయత్నించారు. వెంకీ కథ పాతదే అయినా, గతంలో చాలా సినిమాలు చూసినా, దర్శకుడు తనదైన శైలిలో ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించాడని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి ఎంగేజింగ్ మూమెంట్స్ లేకుండా ఫ్లాట్ నోట్లో కొనసాగుతుంది. కానీ బాలు సార్ ఎంట్రీ, కాలేజీకి వెళ్లడం సహా కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి. కానీ వెంకీ సెకండాఫ్‌తో బ్యాలెన్స్ చేశాడని చెప్పవచ్చు. కొన్ని సన్ని వేశాలు మాత్రం సాగదీసినట్లుగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్‌ని సరిగ్గా రాసేందుకు వెంకీ ఇంకాస్త కష్టపడి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. సార్ అనేది విద్యావ్యవస్థలోని లొసుగుల చుట్టూ తిరిగే నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. మరోవైపు ఈ చిత్రం బాలీవుడ్ మూవీ సూపర్ 30కి కొంచెం దగ్గరగా ఉందని అనిపిస్తుంది.
సాంకేతికత
జె.యువరాజ్ ఫోటోగ్రఫీ వర్క్ బాగుంది. అతను సినిమా మొత్తాన్ని ఆకట్టుకునే ఫ్రేమ్‌లతో ప్రదర్శించాడు. జివి ప్రకాష్ కుమార్(gv prakash kumar) తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరోసారి అద్భుతంగా పనిచేశాడని చెప్పవచ్చు. ఆయన పాటలు తెరపై వినసొంపుగా ఉంటాయి. ప్రధానంగా మాస్టారు మాస్టారు ఆల్బమ్‌లో బెస్ట్ సాంగ్. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. ప్రొడక్షన్ డిజైన్ వర్క్ కొన్ని లోపాలు ఉన్నట్లు అనిపిస్తుంది.