బిర్యానీ కోసం ఓ వ్యక్తి ఏకంగా.. రాష్ట్ర హోం మినిష్టర్ కాల్ చేశాడు. అర్థరాత్రి ఏ సమయం వరకు హోటళ్లు తెరచి ఉంటాయని… తమకు బిర్యానీ కావాలంటూ ఓ వ్యక్తి ఏకంగా హోం మంత్రి మహమూద్ అలీకి కాల్ చేయడం గమనార్హం.
ఇంతకీ మ్యాటరేంటంటే… హైదరాబాద్ పాతబస్తీలో ఓ వ్యక్తి బిర్యానీ విషయంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశాడు.. అర్ధరాత్రి ఎన్ని గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంటాయో చెప్పాలని హోం మంత్రిని ఫోన్ లో కోరారు. దీంతో మహమూద్ అలీ ఫోన్ చేసిన వ్యక్తిపై అసహనం వ్యక్తం చేశారు. తాను రాష్ట్ర హోం మంత్రినని.. తనకు చాలా టెన్షన్లు ఉంటాయని చెప్పి ఫోన్ కట్ చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా… హైదరాబాద్ లో అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నగర సీపీని ఎంఐఎం నేతలు కలిశారు. పాతబస్తీలో అర్ధరాత్రి వరకు బిర్యానీ హోటళ్లు తెరిచి ఉంచాలని ఎంఐఎం నేతలు పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా పాతబస్తీలో అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాల అనుమతి కోసం..గతంలో ఎంఐఎం నేతలు హైదరాబాద్ కమిషనర్‌ను కలిశారు. పాతబస్తీలో అర్ధరాత్రి వరకు బిర్యానీ హోటళ్లు తెరిచి ఉంచాలని ఎంఐఎం నేతలు పట్టుబడుతున్నారు.