రాయచోటి వీరభద్ర స్వామివారిని రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన వారి కుటుంబ సభ్యులు కలిసి దర్శించుకున్నారు. వారికి దేవస్థాన అర్చక స్వాములు, ఆలయ ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఆలయ కార్యనిర్వాహణాధికారి డీవీ రమణారెడ్డి పూర్ణపలంతో స్వాగతం పలికారు. అర్చనలు చేసిన అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.