AP: చిత్తూరులోని నరసింహాపురం ఎంపీటీసీ సభ్యుడు జగన్నాథరాజు గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ద్వారా వాయిదాల చెల్లింపు పద్ధతిలో జగన్నాథరాజు జేసీబీ కొనుగోలు చేశారు. చెల్లింపులో జాప్యానికి రుణ సంస్థ నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని రుణసంస్థ ప్రతినిధులు అపహరించారు. విజయవాడకు వాహనంలో తీసుకెళ్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.