మనం ఒంట్లో కాస్త నలతగా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళతాం. ఆ డాక్టర్ పరిశీలించి మనకు మందులు ఓ చీటి మీద రాసిస్తాడు. మీరు గమనించారో లేదో… డాక్టర్ రాసే మందుల చీటి మనం చదవాలని ప్రయత్నించినా అర్థం కాదు. దాదాపు డాక్టర్లు అందరూ మనకు అర్థం కాకుండానే రాస్తారు. మెడికల్ షాప్ లో వారికి తప్పితే ఎవరికీ అర్థం కాదు. అయితే.. ఓ డాక్టర్ మాత్రం ముత్యాల్లాంటి అక్షరాలతో… ముందుల చీటి రాసి అందరినీ షాకింగ్ కి గురి చేశాడు.
పూర్తి వివారల్లోకి వెళితే… కేరళ లోని పాలక్కడ్లోని నెమ్మరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చిన్నపిల్లల వైద్యుడు నితిన్ నారాయణన్ అందరికీ అర్థమయ్యేలా ముత్యాల్లాంటి అక్షరాలతో రాయడం విశేషం.ప్రస్తుతం ఆయన రాసిన మందుల చీటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
త్రిస్సూరు జిల్లాలోని పడియూరుకు చెందిన డాక్టర్ నితిన్ నారాయణన్.. త్రిస్సూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో పీజీ పూర్తిచేసి గత మూడేళ్లుగా పాలక్కడ్ CHCలో వైద్యుడి సేవలందిస్తున్నారు.
రోగులకు అర్థమయ్యేలా డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాయాలని ఎన్నోసార్లు కోర్టులు చెప్పినా.. ఇప్పటికీ చాలా మంది చీటిని స్పష్టంగా రాయరు. గజిబిజి గందరగోళంగా రాస్తారు. కానీ నితిన్ నారాయణన్ అందరిలా కాదు. ఫార్మసిస్ట్తో పాటు రోగులకు కూడా స్పష్టంగా అర్థమయ్యేలా.. క్యాపిటల్ లెటర్స్లో ప్రిస్క్రిప్షన్ రాస్తారు. పెద్ద అక్షరాల్లో రాయడం వల్ల.. ఆయన రాసిన మందుల వివరాల చాలా ఈజీగా అర్ధమవుతాయి.