GDWL: రైతు భరోసా పథకం లబ్ధి పొందాలంటే ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరిగా చేసుకోవాలని ధరూర్ మండల ఏఈఓ స్వరూప సూచించారు. పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులంతా నమోదు పూర్తి చేయాలని కోరారు. రిజిస్ట్రీ చేసిన వారికే ప్రభుత్వం నగదు జమ చేస్తుందని తెలిపారు. వివరాలు నమోదు చేయని అర్హులైన రైతులకు ఆర్థిక సాయం నిలిచే అవకాశం ఉందని హెచ్చరించారు.