KNR: కరీంనగర్ నగర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, స్వచ్ఛ సర్వేక్షన్-2026లో ఉత్తమ ర్యాంకు సాధించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వార్డులో వంద శాతం చెత్త సేకరణ జరగాలన్నారు.