»Auro University Students To Present Gold Plated Rose Bouquet To Pm Modi On V Day
PM Narendra Modi : వాలంటైన్స్ డే రోజున మోదీకి స్పెషల్ గిఫ్ట్…!
PM Narendra Modi ప్రధాని నరేంద్రమోదీకి వాలంటైన్స్ డే రోజున అరుదైన బహుమతి దక్కింది. మోదీకి సూరత్ లోని ఆరో వర్సిటీ విద్యార్థులు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ప్రధాని మోడీపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు గాను విద్యార్థులు బంగారంతో పూత పూసిన బొకేను ప్రధానికి బహుమతిగా అందజేశారు.

బొకేలో 24 క్యారెట్ల బంగారు పూత పూసిన 151 గులాబీలు ఉన్నాయి. దేశంలో ప్రధాని మోడీ ఎన్నో అభివృద్ది పనులు చేశారని సూరత్ విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల పట్ల ఆయన భావాలు చాలా గొప్పవని వారు పేర్కొన్నారు. ప్రధాని మోడీ తమకు ఆదర్శమన్నారు.
అందుకే ఈ ప్రేమికుల దినోత్సవం రోజున ఆయనకు బంగారు గులాబీల బొకే అందించామన్నారు. ప్రధాని మోడీ పాలనలో మన దేశం ఇతర దేశాలకు స్పూర్తిగా నిలుస్తోందన్నారు. ఆయన గౌరవానికి సూచనగా తాము ఈ పుష్ప గుచ్చాన్ని ఇచ్చామని చెప్పారు.