మానవుడు చనిపోయిన తర్వాత అతని ఆత్మ 13 రోజుల పాటు ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్యే తిరుగుతూ ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. కుటుంబీకుల ఏడుపు, బాధను గమనిస్తుందట. కానీ వారితో మాట్లాడలేక, తాకలేక ఓ విధమైన వేదనకు గురవుతుందట. ఈ 13 రోజుల్లో పెట్టే పిండం ఆత్మకు ఆహారంగా మారుతుందని నమ్ముతారు. ఈ కర్మకాండల ద్వారా ఆ ఆత్మ అంతిమ వీడ్కోలు పలుకుతుందట.