DK Aruna : బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయం : డీకే అరుణ
మరోవైపు వచ్చే ఎన్నికల్లో (Hung) హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, అప్పుడు కాంగ్రెస్‌తో కేసీఆర్ చేతులు కలుపుతారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. వరంగల్ సభలో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ (Rahul Gandhi)చెప్పిన మాటల్ని మాత్రమే తాను రిపీట్ చేశానని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో పోత్తులపై ఎంపీ కోమటిరెడ్డి (Komatireddy) వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ పై తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ (DK ARUNA) స్పందించారు. రాబోయే ఎలక్షన్ లో బీఆర్ఎస్( BRS) ,కాంగ్రెస్ పొత్తు ఖాయమని..తాము చెప్పింది. నిజమని రూఢీ చేసేలా వెంకటరెడ్డి మాట్లాడారని ఆమె అన్నారు. కాంగ్రెస్ , కేసీఆర్ (KCR) నాటకాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆమె విమర్మించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయన్న తమ వాదన నిజమని ఇవాళ మరోసారి తెలిపోయిందన్నారు. తెలంగాణ (Telangana) లో రోజురోజుకు బలోపేతమవుతున్న బీజేపీని దెబ్బతీయాలన్న ఎజెండాతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. ‘నువ్వు కొట్టినట్టు చెయ్, నేను తిట్టినట్టు చేస్తా’ అన్న చందాన ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయని పేర్కొన్నారు. పైకి విమర్శించుకుంటున్నట్టు కనిపిస్తున్నా.. లోన మాత్రం ఆ రెండు పార్టీలు చేతులు కలిపాయన్నారు.
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారని.. పార్లమెంటులోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలు కలిసే ఉన్నారని అన్నారు. దీనిపై ప్రజలు ఆలోచించాలని సూచించారు. తెలంగాన రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై మొదటి నుంచీ గట్టిగా పోరాడుతోందని ఒక్క బీజేపీ మాత్రమేనని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను సమర్థంగా నిర్వహించలేక.. కేసీఆర్‌తో కాంగ్రెస్ (Congress) లోపాయికారీ ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడాన్ని మనం చూస్తూనే ఉన్నామని.. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు మళ్లీ బీఆర్ఎస్ పంచన చేరడం ఖాయమని ఉద్ఘాటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని.. కాంగ్రెస్‌కు ఓటేసినా, బీఆర్ఎస్కు ఓటేసినా ఆ ఓటు కేసీఆర్‌కే వెళ్లడం తథ్యమని అన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ నాటకాలు ఇంకా ఎక్కువకాలం కొనసాగలేవన్నారు. ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారని.. కాంగ్రెస్, (Congress) బీఆర్ఎస్ నీచ రాజకీయాలను అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. తగిన సమయంలో ఈ రెండు పార్టీలకు ప్రజలు తప్పక గుణపాఠం చెప్తారని జోస్యం చెప్పారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో (Hung) హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, అప్పుడు కాంగ్రెస్‌తో కేసీఆర్ చేతులు కలుపుతారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. వరంగల్ సభలో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ (Rahul Gandhi)చెప్పిన మాటల్ని మాత్రమే తాను రిపీట్ చేశానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన సర్వేల ఆధారంగానే తాను ఆ కామెంట్(Comment) చేశానని, తాను స్వతహాగా ఎలాంటి సర్వేలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా.. బీజేపీ( BJP) నేతలు తన వ్యాఖ్యలపై రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై అనవసరం రాద్ధాంతం చేస్తున్నారని.. తన వ్యాఖ్యలు ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమవుతుందని అన్నారు. హంగ్ వస్తుందని తాను అనలేదని పేర్కొన్నారు. చిన్న చిన్న నాయకులు సైతం తనని తిట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రస్తుతం తాను ఏ కమిటీలో లేనని వెల్లడించారు. తాను కన్ఫ్యూజన్లో ఉన్నానని బీజేపీ వాళ్లు అంటున్నారని, అయితే వారే అయోమయంలో ఉన్నారన్న విషయం వాళ్లకు తెలియడం లేదని చురకలంటించారు. తానేం తానేం తప్పు మాట్లాడలేదని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పారు.