»Vijayawada Tummalapalli Kalakshetram Name Changed
Tummalapalli Kalakshetram: తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరు మార్చేశారు
విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం... తెలుగు సాహితీ, కళాప్రియులకు సుపరిచితం. ఇప్పుడు ఆ కళాక్షేత్రం పేరు కూడా మారింది! ఈ పేరులోను తుమ్మలపల్లివారి క్షేత్రయ్య పేరు మాయమైంది. కేవలం కళాక్షేత్రం అని మాత్రమే ఉంది.
విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం… తెలుగు సాహితీ, కళాప్రియులకు సుపరిచితం. ఇప్పుడు ఆ కళాక్షేత్రం పేరు కూడా మారింది! ఈ పేరులోను తుమ్మలపల్లివారి క్షేత్రయ్య పేరు మాయమైంది. కేవలం కళాక్షేత్రం అని మాత్రమే ఉంది. ఆడిటోరియానికి కేవలం కళాక్షేత్రం అనే పేరును మాత్రమే ఉంచడం పైన సాహితీప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు విశ్వవిద్యాలయాలు, పథకాల పేర్లును మార్చింది వైసీపీ ప్రభుత్వం. కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడంపై తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరిగింది. ఇది తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా తెలుగు సాంస్కృతిక, కళా వైభవానికి కృషి చేసిన దాత, మహానుభావుడి పేర్లను కళాక్షేత్రం నుండి తొలగించడం వివాదంగా మారింది. మహాకవి, దాత ఔన్నత్యాన్ని కించపరిచేలా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా విశాలమైన స్థలంలో దీనిని నిర్మించారు. ఆర్టీసీ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్కు సమీపంలో ఏలూరు కాలువ, రైవస్ కాలువ మధ్య ఉంటుంది. 1953లో శిలాఫలకం వేయగా, ఇదే నగరానికి చెందిన డాక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి నారాయణ పంతులు ఈ స్థలాన్ని ఆడిటోరియం నిర్మాణం కోసం దానమిచ్చారు. మొదట తుమ్మలపల్లి వారి మున్సిపల్ ఆడిటోరియం పేరుతో నిర్మాణం చేపట్టినప్పటికీ, ఆ తర్వాత తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంగా నామకరణం చేశారు. క్షేత్రయ్య ప్రముఖ వాగ్గేయకారుడు. దాత పేరు, మహాకవి పేరు వచ్చేలా మార్చారు. నాటి నుండి ఈ ఆడిటోరియం సాంస్కృతిక, కళా ప్రదర్శనలతో పాటు ఎన్నింటికో వేదిక అయింది. ఈ ఆడిటోరియంలో అంతకుముందు రామకోటి ఉత్సవాలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత సత్యనారాయణపురంకు మారింది.