»Jean Eric Vergne Wins Hyderabad Formula E Grand Free Race
jean eric vergne:ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ రేసు విజేత జీన్ ఎరిక్ వేర్‌నే
హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ రేసులో జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. న్యూజిలాండ్‌కు చెందిన నిక్ క్యాసిడీ (ఎన్విజన్ రేసింగ్ టీమ్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. స్విట్జర్లాండ్ రేసర్ సెబాస్టియన్ బ్యూమీ (ఎన్విజన్ రేసింగ్ టీమ్) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఫైనల్ రేసు చూసేందుకు ప్రముఖులు తరలివచ్చారు.
jean eric vergne:హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ రేసులో జీన్ ఎరిక్ వెర్నే (jean eric vergne) విజేతగా నిలిచాడు. న్యూజిలాండ్‌కు చెందిన నిక్ క్యాసిడీ (ఎన్విజన్ రేసింగ్ టీమ్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. స్విట్జర్లాండ్ రేసర్ సెబాస్టియన్ బ్యూమీ (ఎన్విజన్ రేసింగ్ టీమ్) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఫైనల్ రేసు చూసేందుకు ప్రముఖులు తరలివచ్చారు.
రెండుసార్లు ఛాంపియిన్
ఫ్రాన్స్ కు చెందిన జీన్ ఎరిక్ వెర్నే గతంలో రెండు సార్లు (two times) ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రేసులో వెర్నే అమెరికా టీమ్ డీఎస్ పెన్స్ కే తరఫున బరిలో దిగాడు. ఫార్ములా-ఈ రేసులు 2014లో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వెర్నే అప్పటినుంచి ఈ రేసింగ్ లీగ్‌లో అగ్రగామి రేసర్లలో కొనసాగుతున్నాడు. హైదరాబాద్‌లో ఈ రోజు నిర్వహించిన రేసులో భారత్‌కు చెందిన మహీంద్రా (mahindra), జాగ్వార్ (jaquar) టీసీఎస్ (tcs) రేసింగ్ టీమ్‌లు కూడా పాల్గొన్నాయి.
6వ స్థానంలో మహీంద్రా
మహీంద్రా (mahindra) రేసింగ్ టీమ్‌కు చెందిన ఒలివర్ రోలాండ్ 6వ స్థానంలో నిలిచాడు. అదే జట్టుకు చెందిన లూకాస్ డి గ్రాస్సి 14వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. జాగ్వార్ (jaquar), టీసీఎస్ (tcs) రేసింగ్ టీమ్‌కు ఈసారి కూడా అదృష్టం కలిసిరాలేదు. టీసీఎస్ రేసింగ్ టీమ్‌కు చెందిన శామ్ బర్డ్ తన కారుతో మిచ్ ఇవాన్స్ కారును ఢీకొట్టాడు. దాంతో ఇద్దరి కార్లను రేసు నుంచి తప్పించారు. తదుపరి ఫార్ములా-ఈ రేసు మరో రెండు వారాల్లో దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరగనుంది.
20 వేల మంది
రేసు కోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ (ntr marg)లో ‘హైదరాబాద్ స్ట్రీ సర్క్యూట్’ని రెడీ చేశారు. ఈ సర్క్యూట్ పొడవు 2.8 కిమీ పొడవుకాగా.. 18 మలుపుల్ని ఏర్పాటు చేశారు. రేసుని దాదాపు 20 వేల మంది ప్రేక్షకులు కూర్చుని వీక్షించేలా గ్యాలరీను సిద్ధం చేశారు.
సెలబ్రిటీల రాక
మెయిన్ రేసు వీక్షించేందుకు సెలెబ్రిటీలు (celebrities) కూడా వచ్చారు. శుక్రవారం ఫ్రీ ప్రాక్టీస్ రేసు కూడా జరిగింది. ఆ రేసుని వీక్షించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి, మహేష్ బాబు భార్య నమ్రత వచ్చారు. హుస్సేన్‌సాగర్ తీరంలో జరగబోతున్న రేసులో అభిమానులకి సపోర్ట్ చేసేందుకు ఎంబీఏ చదువుతున్న విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.