పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ అప్టేడ్.. ఇప్పుడు సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇన్నాళ్లు అదిగో, ఇదిగో అని హై టెన్షన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ‘రాముడి’ లుక్ రావడానికి ఎట్టకేలకు రంగం సిద్దం అయిపోయింది. ఇప్పటికే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లోడింగ్ అంటూ.. నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు ఆదిపురుష్ టైం దాదాపుగా ఫిక్స్ అయిపోనట్టేనని అంటున్నారు. అది కూడా అయోధ్యలో గ్రాండ్‌గా ప్లాన్ చేశారని తెలిసినప్పటి నుంచి.. వెయ్యి కళ్లతో ఎదురు చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే దర్శకుడు ఓం రౌత్ అయోధ్యలో పర్యటిస్తున్నాడని టాక్. అక్టోబర్ 2న ఆదిపురుష్ అప్టేట్ కోసం ముహూర్తం ఫిక్స్ చేశారని చాలా రోజులుగా వినిపిస్తోంది.
ఇప్పుడది ఫిక్స్ అయిందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. దాంతో ట్విట్టర్లో ఆదిపురుష్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఇక్కడ మరో విశేషమేంటంటే.. ఆదిపురుష్‌తో పాటు రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘విక్రమ్ వేద’ మూవీని బాయ్ కాట్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. ఈ లెక్కన నార్త్‌లో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు ఎవరో ఒకరు హీరోని ట్యాగ్ చేస్తూ.. ఆదిపురుష్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ 2న ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయి.. అది ఊహకందని విధంగా ఉంటే మాత్రం.. ప్రభాస్ ఫ్యాన్స్ తాకిడిని సోషల్ మీడియా తట్టుకోవడం కష్టమనే చెప్పాలి. ఇక కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఏదేమైనా ఆదిపురుష్ పై హై టెన్షన్ తగ్గాలంటే.. మరో రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.