»Chandrabose And Keeravani Gets Invitation From Oscar Team
RRR : ఆస్కార్ నుంచి కీరవాణి, చంద్రబోస్కు ప్రత్యేక ఆహ్వానం.. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వచ్చినట్టేనా?
మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇప్పటికే సినిమా డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ కు ఆహ్వానం అందింది. దాని కంటే ముందే మరో వేడుక కోసం ఆర్ఆర్ఆర్
RRR : తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళికే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆస్కార్ నామినేషన్స్ లో ఇండియన్ సినిమా అది తెలుగు సినిమా నిలవడమే పెద్ద అచీవ్ మెంట్. ఆస్కార్ అవార్డు గెలిచినంత సంతోషాన్ని నాటు నాటు పాట తెలుగు ప్రేక్షకులకు ఇచ్చింది.
మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇప్పటికే సినిమా డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ కు ఆహ్వానం అందింది. దాని కంటే ముందే మరో వేడుక కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి కేవలం కీరవాణి, చంద్రబోస్ కు ఆహ్వానం అందిందట. వీళ్లిద్దరినే ఎందుకు పిలిచారు. ఆ వేడుక ఏంటి అంటారా? అది లంచ్ పార్టీ. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన అన్ని సినిమాల నామినీలను లంచ్ కు పిలుస్తారు. కానీ.. నాటు నాటు పాటను రాసిన చంద్రబోస్ కు, దానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన కీరవాణికి మాత్రమే పిలుపు రావడంతో ముందు చంద్రబోస్ అమెరికాకు వెళ్తున్నారట. ఆ తర్వాత రెండు మూడు రోజులకు కీరవాణి కూడా అమెరికాకు వెళ్తారట.
RRR : లంచ్ కు రాజమౌళిని పిలవలేదా?
లంచ్ పార్టీకి సినిమా దర్శకుడు రాజమౌళిని పిలిచారా? పిలవలేదా? అనే దానిపై క్లారిటీ లేదు. వీళ్లిద్దరికే స్పెషల్ గా ఆహ్వానం అందింది అంటే నామినేషన్స్ లో ఉన్న నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకి ఎంపికైందా.. అందుకే ముందు వీళ్లను లంచ్ కు ఆహ్వానించారా? అని సినీ అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా మార్చి 12న జరిగే వేడుకకు మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ మొత్తం వెళ్లనుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. పలు ఇతర అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆస్కార్ కూడా వచ్చిందంటే.. తెలుగు సినిమా స్థాయి ప్రపంచం అంతా విస్తరించినట్టే. ఇక నుంచి తెలుగు సినిమా ప్రాంతీయ సినిమా కాదు.. అంతర్జాతీయ సినిమా అని తెలుగోడు కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు.