కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా యాహూ (Yahoo) కూడా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు (Layoff) సిద్ధమైంది. తమ మొత్తం వర్క్ ఫోర్స్లో 20 శాతానికి పైగా తొలగించే అవకాశాలు ఉన్నాయని యాహూ గురువారం షాకింగ్ న్యూస్ చెప్పింది.
కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా యాహూ (Yahoo) కూడా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు (Layoff) సిద్ధమైంది. తమ మొత్తం వర్క్ ఫోర్స్లో 20 శాతానికి పైగా తొలగించే అవకాశాలు ఉన్నాయని యాహూ గురువారం షాకింగ్ న్యూస్ చెప్పింది. యాహూ అడ్వర్టైజింగ్ టెక్ విభాగాన్ని పునర్మించే ప్రణాళికలో భాగంగా వెయ్యి మంది వరకు ఉద్యోగులను ఈ వారం తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్ ఏడాది చివరి వరకు 50 శాతం టెక్ ఉద్యోగులపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది.
అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్ యాజమాన్యంలోని యాహూ ఫర్ బిజినెస్ యాడ్ టెక్ యూనిట్ ఉద్యోగుల సంఖ్యను దాదాపు యాభై శాతం తొలగించనుంది. మొత్తంగా యాహూలో 20 శాతం కంటే ఎక్కువమంది ఉద్యోగులను తగ్గించనున్నారు. అనిశ్చిత ఆర్థిక వాతావరణం వల్ల ఉద్యోగుల కోత తప్పడం లేదని కంపెనీ తెలిపింది. చాలామంది అడ్వటైజర్లు మార్కెట్లో పెట్టాల్సిన డబ్బులను వెనక్కి తీసుకుంటున్నారని, ఇందుకు అధిక ద్రవ్యోల్భణం కారణమని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ విభజన పునర్నిర్మాణం కారణంగా ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.