ఉదయం కాఫీ, టీలు తీసుకోవటం సాధారణం. అయితే అతిగా కాఫీ తాగితే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అలా జరగకూడదంటే నాణ్యమైన కాఫీ గింజలు వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ వాడకూడదు. కాఫీపైన క్రీమ్ వాడేవారు తక్కువగా వేసుకోవాలి. దాల్చిన చెక్క కాఫీలో కలిపి తాగితే షుగర్ నియంత్రణలో ఉంటుంది. యాలకుల పొడి కలుపుకుంటే ఎసిడిటీ తగ్గుతుంది. స్పైసీ, ఫ్రైడ్ ఫుడ్ తిన్న తర్వాత.. సాయంత్రం, రాత్రి పూట కాఫీ తాగకూడదు.