ప్రకాశం: చీరాల మండలం చీరాలలో రాష్ట్ర సివిల్ సప్లయిస్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కార్మికులు కూలీ రేట్లు పెంచాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు శామ్యూల్ మాట్లాడుతూ.. హమాలీల కూలి రేట్లు పెంచకపోవడంతో జీవనం భారంగా మారిందని అన్నారు. హమాలీలకు పని భద్రత కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.