అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే పలుమార్లు తన ప్రసంగంలో తడబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల న్యూయార్క్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో బైడెన్ మరోసారి తడబడ్డారు. ఈ సభలో ప్రసంగిస్తూ.. వెల్కమ్ టూ న్యూయార్క్ అని చెప్పబోయి వెల్కమ్ టూ వాషింగ్టన్ అని అన్నారు. దీంతో అక్కడి వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.