ADB: హెచ్ఐవీ నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జి డీఎంహెచ్ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. హెచ్ఐవీ ద్వారా సంక్రమించే వ్యాధులు, వాటి నుంచి రక్షణ పొందటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో క్రియేటివ్ కళాజాత బృందం బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు.