BDK: చండ్రుగొండ మండలం ప్రధాన సెంటర్ నుంచి జూలూరుపాడు రోడ్డుకు రెండువైపులా డ్రైనేజ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, పక్క గోడ నిర్మాణానికి కాల్వ తవ్వారు, అదే కాలువకు ఆనుకుని ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్ పొరపాటున డామేజ్ అవ్వడంతో నీరు వృధాగా పోతుందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి పైప్లైన్ మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.