AKP: అచ్యుతాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి ప్రాయశ్చిత్త దీక్షను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేపట్టనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. ఈ మేరకు అచ్యుతాపురంలో కూటమి నాయకులు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 11 రోజులు పాటు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్ష జరుగుతుందన్నారు.