SKLM: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన రణస్థలం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. రణస్థలం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలో నెలివాడకు చెందిన ఎండువ సింహాచలం(51) రణస్థలం సబ్లజిస్ట్రార్ కార్యాలయంకు పని నిమిత్తం వచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్నారు. దన్నానపేట సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది.