AP: కృష్ణా జిల్లాలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. గన్నవరం శివారులో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. విశాఖ నుంచి వస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. మృతులు బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్(25), మేరీ(38)గా గుర్తించారు. విజయవాడ జీజీహెచ్‌కు క్షతగాత్రులను పోలీసులు తరలించారు.