ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి మరో అరుదైన అవకాశం దక్కింది. 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ‘కల్కి’ ఎంపికైంది. అక్టోబర్ 2 నుంచి 11 వరకు జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓపెన్ సినిమా విభాగంలో మూవీని ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలో BIFFలోని అతిపెద్ద బహిరంగ థియేటర్లో కల్కిని అక్టోబర్ 8, 9 తేదీల్లో ప్రదర్శించనున్నారు.